BREAKING
శరద్ కపూర్‌కు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్, సోనూ సూద్.. ఏఐసీడబ్ల్యూఏ ప్రత్యేక కృతజ్ఞతలు! ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు చరిత్ర సృష్టించిన తమిళ సంగీతం.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న దేవన్ ఏకాంబరం ‘వర్చువాయ్’ పాట! గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం! సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక. గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు.... మనవరాలు ఆరాధ్య బచ్చన్ పుట్టినరోజు వేడుక.. అమితాబ్ బచ్చన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్! పారా క్రీడల్లో మెరిసిన ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి భరత్ కుమార్- కళాశాల చైర్మెన్ వెంకట రామిరెడ్డి మైనర్‌ను అపహరించి హైదరాబాద్‌కు తరలింపు.. ఆటో డ్రైవర్ అరెస్ట్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు నిజం.. సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 800 కోట్ల మైలురాయికి అత్యంత చేరువలో రణబీర్, యశ్ చిత్రం! కొత్త జేమ్స్ బాండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ సరసన బాండ్ గర్ల్ ఎవరు?.. రేసులో ముందంజలో ఉన్న హాలీవుడ్ భామలు వీరే! బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ జోరు.. 11 రోజుల్లో 140 కోట్ల మార్క్ చేరువలోకి చేరిన కలెక్షన్లు! గుమ్మగట్ట కేజీబీవి లో కలకలం...25 మందికి అస్వస్థత.. అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య

గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం!

Select Suryaa Now
గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం!

గుమ్మగట్ట మేజర్ న్యూస్:

రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని కేజీబీవీ పాఠశాలలో నిన్న రాత్రి తిన్న ఆహారం వలన దాదాపు 45 మంది బాలికలు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అందులో 6 మంది తీవ్రంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు,అస్వస్థతకు గురైన బాలికలను వెంటనే గుమ్మగట్ట ప్రాథమిక వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియగానే ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రాథమిక వైద్యశాలకు చేరుకుని, చికిత్స పొందుతున్న బాలికలను సందర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు,నిన్న రాత్రి సాంబారు, ఇతరత్రా పదార్థాలు కలుషితమయ్యాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. విచారణ జరిపి సరఫరా దారుని పైన , సూపర్వైజింగ్ సిబ్బంది పైన తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు,కేజీబీవీ అంటేనే నమ్మకం... కానీ ఇది బాధాకరం కేజీబీవీ అంటే చాలా డిమాండ్ ఉన్న పాఠశాలలు. ఇక్కడ మెరుగైన విద్య, ఆహారం ఉంటాయని పిల్లల తల్లిదండ్రులు నమ్ముతారు. కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే అన్నారు,ఏది ఏమైనా తప్పు ఎక్కడ జరిగిందో విచారణ చేసి వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలికల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయబోమని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు..

 

సూర్య ప్రతినిధి: పెన్నయ్య గుమ్మగట్ట మండల రిపోర్టర్