మహా పాదయాత్ర సందర్భంగా టోంకిని సిద్ధి హనుమాన్ స్వామివారిని దర్శించుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు
సూర్యసిర్పూర్ టి :-మండలం టోంకిని గ్రామంలో వెలిసిన శ్రీ టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయంలో మహా పాదయాత్ర సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం భజన బృందంతో కలిసి భజన సంకీర్తనల్లో పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వారి కృపతో ఎల్ నినో ప్రభావం నుండి తెలంగాణ రాష్ట్రం గట్టెక్కాలని వేడుకున్నారు.