BREAKING
హీరో హర్షవర్ధన్ రాణేకు రూ.3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్.. మాట నిలబెట్టుకున్న ప్రముఖ నిర్మాత తెలుగు ప్రేక్షకుల మధ్య మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓం ప్రీ రిలీజ్ వేడుకలో సందడి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమ మహాపాదయాత్ర సందర్భంగా అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి డి ఎం అండ్ హెచ్ ఓ మహా పాదయాత్ర సందర్భంగా టోంకిని సిద్ధి హనుమాన్ స్వామివారిని దర్శించుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు రెండోసార్లు తల్లికాబోతున్న ప్రముఖ టీవీ నటి విన్నీ అరోరా.. పదవ పెళ్లిరోజున సర్ప్రైజ్ ఇచ్చిన ధీరజ్ ధూపర్ దంపతులు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి రూపేష్ గుప్తాకు టీడీపీ బీఫామ్ అందజేత భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం శరద్ కపూర్‌కు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్, సోనూ సూద్.. ఏఐసీడబ్ల్యూఏ ప్రత్యేక కృతజ్ఞతలు! ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు చరిత్ర సృష్టించిన తమిళ సంగీతం.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న దేవన్ ఏకాంబరం ‘వర్చువాయ్’ పాట! గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం! సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక. గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు....

భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం

Select Suryaa Now
భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం

భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం

* గుర్తింపు కార్డుల విషయంలో తలెత్తిన వివాదం

* ప్రమాదంగా చిత్రీకరించే యత్నం.. సీసీ ఫుటేజీతో వెలుగులోకి వాస్తవాలు.

భద్రాచలం సూర్య న్యూస్::

భద్రాచలం పట్టణంలోని ఓ లాడ్జిలో తలెత్తిన స్వల్ప వివాదం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. గుర్తింపు కార్డుల విషయంలో సిబ్బందితో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు సంఘటన స్థలంలోని మృతి చెందాడు.పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామానికి చెందిన తెల్లం శరత్ (24) సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో భద్రాచలంలోని శ్రీ సత్యసాయి రెసిడెన్సీ లాడ్జిలో గది అద్దెకు తీసుకునేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో ఆధార్,రేషన్ కార్డులు చూపించాలనే విషయమై శరత్‌కు లాడ్జి సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో సిబ్బంది శరత్‌పై దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శరత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.అయితే ఈ దాడిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు,సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గిరిజన యువకుడ్ని దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భద్రాచలం ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సీఐ సట్ల రాజుకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

సూర్య రిపోర్టర్ కల్లూరి సుమన్..