BREAKING
హీరో హర్షవర్ధన్ రాణేకు రూ.3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్.. మాట నిలబెట్టుకున్న ప్రముఖ నిర్మాత తెలుగు ప్రేక్షకుల మధ్య మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓం ప్రీ రిలీజ్ వేడుకలో సందడి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమ మహాపాదయాత్ర సందర్భంగా అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి డి ఎం అండ్ హెచ్ ఓ మహా పాదయాత్ర సందర్భంగా టోంకిని సిద్ధి హనుమాన్ స్వామివారిని దర్శించుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు రెండోసార్లు తల్లికాబోతున్న ప్రముఖ టీవీ నటి విన్నీ అరోరా.. పదవ పెళ్లిరోజున సర్ప్రైజ్ ఇచ్చిన ధీరజ్ ధూపర్ దంపతులు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి రూపేష్ గుప్తాకు టీడీపీ బీఫామ్ అందజేత భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం శరద్ కపూర్‌కు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్, సోనూ సూద్.. ఏఐసీడబ్ల్యూఏ ప్రత్యేక కృతజ్ఞతలు! ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు చరిత్ర సృష్టించిన తమిళ సంగీతం.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న దేవన్ ఏకాంబరం ‘వర్చువాయ్’ పాట! గుమ్మగట్ట కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కలకలం - 45 మంది బాలికలు అస్వస్థత, 6 మంది పరిస్థితి తీవ్రం! సీనియర్ నాయకుడు ఉమేష్ వైఎస్ఆర్ సీపీలో చేరిక. గ్యాస్ లీకేజీపై ఆందోళన వద్దు....

క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి డి ఎం అండ్ హెచ్ ఓ

Select Suryaa Now
క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి డి ఎం అండ్ హెచ్ ఓ

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించి, చికిత్స కోసం ఉన్నత శ్రేణి ఆసుపత్రులకు పంపించి  అనంతపురం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం పొందినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్  కట్టా వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఎన్ సి డి సర్వేలో భాగంగా  క్యాన్సర్ అనుమానిత కేసులను గుర్తించడం, వారిని తదుపరి పరీక్షలు మరియు చికిత్స నిమిత్తం తరలించడంలో  అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించినట్లు చెప్పారు. జిల్లాలోని వైద్యాధికారులు,  ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశ మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కృషి చేసి ఈ ఘనతను సాధించినట్లు చెప్పారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను అందిస్తున్నట్లు చెప్పారు.

ఈ అత్యుత్తమ పనితీరును గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాకు అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసింది.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బందిని అభినందిస్తూ, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ సుమన్,  నోడల్ అధికారి అధికారి  డాక్టర్  మిథున్ రాకేష్, డాక్టర్ సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.