డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమ
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్
కోదండ రెడ్డి వెంటనే స్పందించాలి
121/2 నెం.లో 1.20 గు. భూమి కేటాయింపు
యాచారం మరో జవహర్ నగర్ కాబోతుందా?
యాచారం మండలం మరో జవహర్ నగర్ గా మారబోతుందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ అన్నారు. యాచారంలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరొక ఉద్యమం రాబోతుందని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్ శాఖ చైర్మన్ కోదండ రెడ్డి స్థానికుడైన వెంటనే స్పందించాలని కోరారు. గతంలో మైనింగ్, డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా కొట్లాడారు. యాచారాన్ని కాపాడుకునే బాధ్యత కోదండ రెడ్డి దేనని ఘాటుగా ఆయన ప్రశ్నించారు. యాచారంలో శ్రీ వెంకటేశ్వర వర్ ప్రాజెక్టు కు సర్వేనెంబర్ 121/2 లో 1.20 భూమి పట్టా పొందారు.
ఫ్యూచర్ సిటీలో డంపింగ్ యార్డ్,ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పట్టించుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. చెప్తా వ్యర్థ పదార్థాలతో, వాసన, దుర్వాసన, వ్యవసాయ పొలాలు, దుమ్ము, పొగ కూడుకొని పంటలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. యాచారంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్య భాష, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజ్ నాయక్, ఓరుగంటి యాదయ్య గౌడ్, సర్పంచ్ నక్క వెంకటేష్, ఉప సర్పంచ్ కిషన్ నాయక్, మహమ్మద్ కాజ్, మాజీ ఉప సర్పంచ్ బీమ్ యాదవ్, కల్లూరి శివ, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కొండ్రు శివ,
యాచారం సూర్య రిపోర్ట్, రంగారెడ్డి జిల్లా