BREAKING
కేజీఎఫ్, సలార్ బాటలోనే ఎన్టీఆర్ డ్రాగన్.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మామూలుగా లేదుగా! శబరిమలలో పోటెత్తిన భక్తజనం.. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం అవార్డుల రేసులో రణ్‌వీర్ సింగ్ సినిమాకు నిరాశ.. ఆశలు గంపెడు పెట్టుకున్నా దక్కని చోటు కీసర పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా.. ఏసీబీ ఘటనలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ హీరో హర్షవర్ధన్ రాణేకు రూ.3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్.. మాట నిలబెట్టుకున్న ప్రముఖ నిర్మాత తెలుగు ప్రేక్షకుల మధ్య మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓం ప్రీ రిలీజ్ వేడుకలో సందడి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమ మహాపాదయాత్ర సందర్భంగా అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి డి ఎం అండ్ హెచ్ ఓ మహా పాదయాత్ర సందర్భంగా టోంకిని సిద్ధి హనుమాన్ స్వామివారిని దర్శించుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు రెండోసార్లు తల్లికాబోతున్న ప్రముఖ టీవీ నటి విన్నీ అరోరా.. పదవ పెళ్లిరోజున సర్ప్రైజ్ ఇచ్చిన ధీరజ్ ధూపర్ దంపతులు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి రూపేష్ గుప్తాకు టీడీపీ బీఫామ్ అందజేత భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం శరద్ కపూర్‌కు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్, సోనూ సూద్.. ఏఐసీడబ్ల్యూఏ ప్రత్యేక కృతజ్ఞతలు! ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు

కీసర పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా.. ఏసీబీ ఘటనలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ

Select Suryaa Now
కీసర పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా.. ఏసీబీ ఘటనలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ

కీసర, మేజర్ న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏసీబీ చర్యల్లో సీఐ ఆంజనేయులు, ఎస్సైలు జ్ఞానేందర్ రెడ్డి, శ్రీనివాస్ చిక్కుకున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడంతో పాటు, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ పెంచినట్లు సమాచారం.ఇకపై కీసర పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. స్టేషన్ ప్రధాన గేటు వద్ద విధులు నిర్వహించే కానిస్టేబుల్ వద్ద ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేసి, సందర్శకుల పేరు, చిరునామా, వచ్చిన సమయం, ఎవరిని కలవడానికి వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారనే వివరాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. స్టేషన్‌లోకి వచ్చే వ్యక్తుల రాకపోకలపై స్పష్టమైన రికార్డు ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఇటీవల చోటుచేసుకున్న ఏసీబీ ఘటనలు పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఓ ఎస్సై సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో స్టేషన్‌పై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారుల వ్యవహారశైలి కారణంగా మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరి వివరాల నమోదు, సిబ్బంది కదలికలపై పర్యవేక్షణ వంటి చర్యలతో పైరవీలు, మధ్యవర్తుల ప్రమేయం, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రహస్య నిఘా ఏర్పాట్లపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఒకప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన కీసర పోలీస్ స్టేషన్‌కు ఇటీవలి పరిణామాలు సవాలుగా మారాయి. కేవలం రిజిస్టర్ల నిర్వహణ, నిఘా చర్యలకే పరిమితం కాకుండా అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, నిజాయితీగా విధులు నిర్వహించే సిబ్బందిని ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. కీసర పోలీస్ స్టేషన్‌పై కొనసాగుతున్న ప్రత్యేక పర్యవేక్షణ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని తిరిగి పెంపొందించగలదా? అనేది వేచి చూడాల్సిందే.