ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం
సూర్య సిర్పూర్ (టి) :కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) లో జరుగుతున్న 25వ టోంకిని శ్రీ సిద్ధి హనుమాన్ మహా పాదయాత్రకు విచ్చేస్తున్న భక్తులందరికీ ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, సిర్పూర్ నియోజకవర్గం నాయకులు సుస్వాగతం పలికారు.పాదయాత్ర మార్గంలో ఎమ్మెల్సీ దండే విఠల్ గారు స్వయంగా పాల్గొని భక్తులకు అల్పాహారం అందజేశారు. ఉదయాన్నే పాదయాత్రకు బయలుదేరి వచ్చిన భక్తులకు ప్రేమతో అల్పాహారం వడ్డించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తులకు సేవ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ, 25 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ మహా పాదయాత్ర సిర్పూర్ ప్రజల భక్తికి, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. భక్తుల సేవ చేసుకోవడం తమ అదృష్టమని, పాదయాత్ర విజయవంతం కావడానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.
పాదయాత్ర అంతటా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్గం మారుమోగింది.