BREAKING
చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ జట్టు.. పదో సాఫ్ ఛాంపియన్‌షిప్ టార్గెట్‌గా పాక్‌తో తుదిపోరు! బయోచార్ ఫలితాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని జిల్లా కలెక్టర్ టెన్నిస్ చరిత్ర సృష్టించిన రష్యా సంచలనం.. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కైవసం చేసుకున్న మిర్రా ఆండ్రీవా! న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్.. భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు మిచెల్ శాంట్నర్ దూరం! ఉమ్మడి భవిష్యత్తును పోటీతో కాదు, సహకారంతో తీర్చిదిద్దుకుందాం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన మయాంక్ యాదవ్.. ట్రిపుల్ వికెట్ మెయిడిన్‌తో పంజాబ్ పతనం! మూడేళ్లు గడిచినా కాంగ్రెస్ 420 హామీల అమలేది..? – బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ డైట్జ్ నియామకం డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమం ఐపీఎల్ 2027కి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరం? బధిర మహిళపై సామూహిక అత్యాచారం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన్న గోథిక్ హర్రర్ థ్రిల్లర్.. అధికారికంగా ప్రకటించిన 'భౌమ 2' పెళ్లి పీటలెక్కిన గద్దలకొండ గణేశ్ హీరోయిన్.. మలేషియాలో అంగరంగ వైభవంగా వివాహం! కేజీఎఫ్, సలార్ బాటలోనే ఎన్టీఆర్ డ్రాగన్.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మామూలుగా లేదుగా! శబరిమలలో పోటెత్తిన భక్తజనం.. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం

మూడేళ్లు గడిచినా కాంగ్రెస్ 420 హామీల అమలేది..? – బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్

Select Suryaa Now
మూడేళ్లు గడిచినా కాంగ్రెస్ 420 హామీల అమలేది..? – బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.2023 ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక హామీల అమలులో వెనుకబడిందని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, రైతులకు రైతు భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛన్ వంటి హామీల అమలు పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన రూ.లక్ష కోట్ల నిధుల కేటాయింపు, 42 శాతం రిజర్వేషన్ల హామీ అమలు పరిస్థితి ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విషయంలో కూడా ప్రజలకు పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరారు.వికారాబాద్ జిల్లాకు సంబంధించి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి కల్పన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పూర్తితో పాటు విద్యా, వైద్య సదుపాయాల మెరుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసం చేసిన ప్రకటనలుగా మిగిలిపోకూడదని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శుభ ప్రద్ పటేల్ పేర్కొన్నారు. మూడు సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా 420 హామీల అమలుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని డిమాండ్ చేశారు.