థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన్న గోథిక్ హర్రర్ థ్రిల్లర్.. అధికారికంగా ప్రకటించిన 'భౌమ 2'
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విభిన్నమైన గోథిక్ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటోంది. దిలీప్ పోతన్, వినీత్, సాగర్ సూర్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమాలోని ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, సరికొత్త కథనం ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో థియేటర్లలో ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. సినిమా విడుదలైన తక్కువ సమయంలోనే ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూసి యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చిత్ర విజయోత్సవ వేడుకలో అమేజింగ్ అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ రానుందని వెల్లడిస్తూ అభిమానులకు పెద్ద ఇచ్చారు. మొదటి భాగం ముగింపులో వీడని కొన్ని రహస్యాలు మరియు మిస్టరీలను తదుపరి భాగంలో పూర్తిగా వివరిస్తామని దర్శకుడు తెలిపారు. మొదటి పార్ట్ సృష్టించిన వైబ్ మరియు విజయమే రెండవ భాగానికి పునాది అయిందని, మరింత పకడ్బందీ కథనంతో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు అ వర్గాలు స్పష్టం చేశాయి. త్వరలోనే ఈ సీక్వెల్‌కు సంబంధించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
దర్శకుడు రెజిన్ ఎస్. బాబు తెరకెక్కించిన ఈ చిత్రంలో రేవతి శర్మ, లీనా, అదితి బాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీర్మేడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొన్ని శతాబ్దాల నాటి రహస్యాలు, ఆత్మల నేపథ్యంతో కూడిన సంఘటనలు ప్రేక్షకులను థ్రిల్ గురిచేశాయి. క్రిస్టో జేవియర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లగా, షారన్ వేలాయుధన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా అద్భుతమైన అనుభూతిని మిగిల్చాయి. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుండటంతో, ఇప్పుడు సీక్వెల్ ప్రకటన రావడంతో సినీ ప్రియుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మిస్టరీ వీడని కొన్ని కీలక ప్రశ్నలకు రెండవ భాగంలో పూర్తి సమాధానాలు దొరుకుతాయని భావిస్తున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. త్వరలోనే రెండవ భాగానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుండగా, ఈ హర్రర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.