BREAKING
చీన్ టపాక్ డుండుం సినిమా నుంచి మరొక్కసారి మెలోడీ సాంగ్ విడుదల.. శ్రోతలను ఆకట్టుకుంటున్న లవ్ సాంగ్! పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్ నేనేమీ సెహ్వాగ్ 2.0 వెర్షన్ కాదు.. నాన్నతో పోలికలపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! తప్పుడు కేసు బనాయించారంటూ.. భద్రాచలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి... విద్యార్థులకు కంటి పరీక్షలు.. 19 మందికి అద్దాల కోసం సిఫార్సు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన కేరళ.. పృథ్వీ షా జట్టుపై భారీ విజయం! ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం జనగణన దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రక్రియ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అభివృద్ధి పనుల నాణ్యతల రాజీ వద్దు:నగర కమిషనర్ మయూర్ అశోక్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం డిపాల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ కు ఎంపిక న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టత పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చెయ్యాలి ఐపీఎల్ 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ.. సంచలన ట్రేడ్ డీల్‌పై ప్రచారం! చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ జట్టు.. పదో సాఫ్ ఛాంపియన్‌షిప్ టార్గెట్‌గా పాక్‌తో తుదిపోరు! బయోచార్ ఫలితాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని జిల్లా కలెక్టర్

తప్పుడు కేసు బనాయించారంటూ.. భద్రాచలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి...

Select Suryaa Now
తప్పుడు కేసు బనాయించారంటూ.. భద్రాచలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి...

భద్రాచలం సూర్య న్యూస్::తనపై తప్పుడు కోడి దొంగతనం కేసు బనాయించారంటూ మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన భద్రాచలంలో కలకలం రేపింది.ఒక చేతిలో పురుగుల మందు డబ్బా, మరో చేతిలో పెట్రోలు డబ్బా పట్టుకుని నిరసన తెలిపి ఆపై పురుగుల మందు తాగాడు.అప్రమత్తమైన పోలీసులు తక్షణమే స్పందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. చర్ల మండలం తెగడ గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి దుమ్ముగూడెం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సర్వేశ్ రావు చెందిన దాదాపు లక్ష రూపాయల విలువ చేసే మూడు కోడిపుంజులను దొంగతనం చేశాడంటూ దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.అయితే తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ నరేష్ మంగళవారం భద్రాచలం అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు.అక్కడ "పోలీసులు డౌన్ డౌన్" అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేష్..అక్కడే పురుగుల మందు తాగాడు.సమాచారం అందుకున్న వెంటనే భద్రాచలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తమయ్యారు. బాధితుడిని తక్షణమే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సూర్య రిపోర్టర్ కల్లూరి సుమన్..