BREAKING
చీన్ టపాక్ డుండుం సినిమా నుంచి మరొక్కసారి మెలోడీ సాంగ్ విడుదల.. శ్రోతలను ఆకట్టుకుంటున్న లవ్ సాంగ్! పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించాలి-సిపిఐపట్టణ కార్యదర్శి కె ప్రసాద్ నేనేమీ సెహ్వాగ్ 2.0 వెర్షన్ కాదు.. నాన్నతో పోలికలపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు! తప్పుడు కేసు బనాయించారంటూ.. భద్రాచలంలో పురుగుల మందు తాగిన వ్యక్తి... విద్యార్థులకు కంటి పరీక్షలు.. 19 మందికి అద్దాల కోసం సిఫార్సు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన కేరళ.. పృథ్వీ షా జట్టుపై భారీ విజయం! ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం జనగణన దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కీలకమైన ప్రక్రియ-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అభివృద్ధి పనుల నాణ్యతల రాజీ వద్దు:నగర కమిషనర్ మయూర్ అశోక్ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామం డిపాల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ కు ఎంపిక న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగనున్న టీమిండియా: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టత పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చెయ్యాలి ఐపీఎల్ 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ.. సంచలన ట్రేడ్ డీల్‌పై ప్రచారం! చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ జట్టు.. పదో సాఫ్ ఛాంపియన్‌షిప్ టార్గెట్‌గా పాక్‌తో తుదిపోరు! బయోచార్ ఫలితాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని జిల్లా కలెక్టర్

అభివృద్ధి పనుల నాణ్యతల రాజీ వద్దు:నగర కమిషనర్ మయూర్ అశోక్

Select Suryaa Now
అభివృద్ధి పనుల నాణ్యతల  రాజీ వద్దు:నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు : గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్, ప్రజారోగ్య విభాగ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ నవ భారత్ నగర్, విద్యా నగర్, వికాస్ నగర్, కెవిపి కాలనీ, శశాంక్ గోయల్ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, శానిటేషన్ పరిస్థితులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మంజూరైన, ప్రస్తుతం కొనసాగుతున్న ఏ అభివృద్ధి పని కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉండడానికి వీలులేదని, నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అయితే పనుల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే సంబంధిత కాంట్రాక్టర్లతోపాటు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే అక్కడ మిగిలిపోయిన నిర్మాణ వ్యర్థాలు, ఇసుక, కంకర వంటి మెటీరియల్‌ను పూర్తిగా తొలగించాలన్నారు. రోడ్లపై మెటీరియల్ అలాగే వదిలేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, పని ముగిసిన వెంటనే పరిసరాలను శుభ్రం చేసే బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లదేనని స్పష్టం చేశారు. ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ లోని పెండింగ్ పోర్షన్ లో వెంటనే రోడ్ నిర్మాణం చేపట్టాలని ఈఈని ఆదేశించారు. పారిశుధ్యం, ఖాళీ స్థలాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజారోగ్య విభాగ అధికారులకు సూచించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకునేలా నోటీసులు జారీ చేసి, స్పందించ కుంటే జరిమానాలు విధించాలన్నారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగుపడాలని, ఎక్కడా రోడ్లపై చెత్త కనిపించకూడదన్నారు. ఉదయం వేళల్లోనే చెత్త సేకరణ ప్రక్రియ పూర్తి కావాలని, మధ్యాహ్నం డ్రైన్లలో పూడికతీత పనులు చేయపట్టాలని ఆదేశించారు.ఈ పర్యటనలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణు వర్ధన్, డిఈఈలు వెంకట రమణ, చైతన్య, రమేష్ బాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

సూర్య నాయక్