టిడిపిలో చేరికలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండపేట మండలం, తాపేశ్వరం గ్రామంలో వైయస్ఆర్సీపీ పార్టీ చెందిన పలువురు ఆ గ్రామ టీడీపీ నాయకులు ముత్యాల పట్టాభి రామారావు, లంకలపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సింగన్న సూరిబాబు, గరగ నాగబాబు, దొడ్డి వెంకట ప్రసన్న బాబు, మేడిశెట్టి గణేష్, వాసంశెట్టి సందీప్ వీరవల్లి దుర్గప్రసాద్ లు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే వేగుళ్ళ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నూని వీర్రాజు, వేగుళ్ళ రామకృష్ణ, వల్లూరి సాయి, గుత్తుల శ్రీను, వాసంశెట్టి శ్రీనివాసు, కోర లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.