BREAKING
ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం! కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం! పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ‘అభయహస్తం’ రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా శబరిమలలో భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు.. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్

పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం

Select Suryaa Now
పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం

మెదక్ జిల్లా ప్రతినేది సూర్య :  మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు* అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ, పేదల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపడమే చేయూత లక్ష్యం లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు* పేదల జీవితాల్లో కొత్త వెలుగులు..  నింపాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం "చేయూత"పింఛన్ల కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. నియోజకవర్గంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. *మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు* స్వయంగా పలు మండలాలు, గ్రామాలు, మెదక్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.పేదల కళ్లలో ఆనందం.. చూడాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వ సంక్షేమం మెదక్ నియోజకవర్గంలో ఘనంగా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా నిరుపేద కుటుంబాలకు ఆత్మగౌరవంతో జీవించేందుకు తోడ్పడే భరోసా అని పేర్కొన్నారు.

నార్సింగి మండలంలో పింఛన్ల పంపిణీ చేశారు. 

నార్సింగి మండలంలోని నాలుగు గ్రామాలకు సంబంధించిన*  86 నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు రైతు వేదికలో ఎమ్మెల్యే పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు.

రామాయంపేట పట్టణం, మండలంలో పింఛన్ల పంపిణీ

రామాయంపేట పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో రామాయంపేట పట్టణం,142 మండల పరిధిలోని  323 నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధాప్యంలో కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా, పేదలకు నెలనెలా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

*నిజాంపేట మండలంలో చేయూత పింఛన్లు పంపిణి*

నిజాంపేట మండలానికి చెందిన 257 నూతన పింఛన్ లబ్ధిదారులకు రేణుక ఫంక్షన్ హాల్‌లో పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లు నిరుపేద కుటుంబాలకు ఎంతో ముఖ్యమైన ఆర్థిక ఆధారమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్సు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.