BREAKING
ఐదు రోజుల్లో షాబాద్ మండలంలో ఇంటింటి సర్వే పూర్తిచేయాలి : కలెక్టర్ నారాయణ రెడ్డి భక్తులకు పండ్లు అందజేసిన మున్నూరు కాపు సంఘం పటేల్స్ నాయకులు. *6 నెలల్లో సమీకృత పశు వసతి కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలి* *పశుసంపద అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా సమీకృత పశుసంవర్ధక కేంద్రాల ఏర్పాటు* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు కూడా త్వరలో ఇవ్వాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రబీ 2026-27 సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా సౌకర్యం* *తక్కువ ప్రీమియంతో పంటలకు ఆర్థిక భద్రత – రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి* *కలెక్టరేట్‌లో పంటల బీమా పథకం పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం! కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా సామల కృష్ణారెడ్డి నియామకం సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం! పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ ‘అభయహస్తం’ రాజన్న ఆలయ గోపురాన్ని ముట్టుకుంటే సహించం: భాజపా శబరిమలలో భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు.. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలి భక్తులకు పండ్లు, వాటర్ బాటిల్ లు అందజేసిన హెచ్.పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్

సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం!

Select Suryaa Now
సమ్మక్క సాగర్ బ్యారేజీకి మార్గం సుగమం.. ఎన్‌ఓసీపై ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం!

రాయ్‌పూర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో అత్యంత కీలకమైన ‘సమ్మక్క సాగర్’ బ్యారేజీకి సంబంధించి అతిపెద్ద అడ్డంకి తొలగిపోనుంది. ఈ ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేసే విషయంలో పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వెంటనే ఎన్‌ఓసీ జారీ చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న మిగిలిన అనుమతుల ప్రక్రియకూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఎన్‌ఓసీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎల్‌నినో (El Nino) పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. కరువు ప్రభావిత, వెనుకబడిన మరియు గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి జలాలను వినియోగించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన ఈ బ్యారేజీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, +83 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఇందులో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందని తెలిపారు.

 

 

ముంపు తగ్గింపు.. ఐఐటీ ఖరగ్‌పూర్ నివేదిక:సమ్మక్క సాగర్ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు 11,408 ఎకరాల భూమి ముంపునకు గురై 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించి, బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చినట్లు సీఎం గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన మేరకు ముంపు అధ్యయనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌లోనే రూ. 9.883 కోట్లు చెల్లించిందని, ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులు అధ్యయనం చేసి జూలై 30న నివేదిక సమర్పించారని వివరించారు. ఆ నివేదిక ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో కేవలం 33 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుందని, భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని స్పష్టమైంది. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేయడంతో, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా త్వరలోనే ఎన్‌ఓసీ జారీ చేసేందుకు ఛత్తీస్‌గఢ్ సర్కార్ అంగీకరించింది.