సూర్య,కాగజ్‌నగర్: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల పరిధిలోని వంజిరి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని వంజిరి గ్రామ సర్పంచ్ గౌత్రే లక్ష్మి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్రోల్ పంపు సముదాయ ప్రధానోపాధ్యాయులు వెంకట dరాజయ్యతో కలిసి కాగజ్నగర్ మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. డిజిటల్ బోధన విద్యార్థుల అభ్యసనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషితో డిజిటల్ తెరను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల హాజరు శాతాన్ని వందకు వంద సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ నెల 20వ తేదీలోగా ప్రాథమిక స్థాయి విద్యార్థులందరూ తమ తరగతులకు సంబంధించిన కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట రాజయ్య మాట్లాడుతూ ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞాన కార్యక్రమంలో భాగంగా నిర్వహించే మధ్యంతర పరీక్షకు విద్యార్థులందరినీ సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామోదర్, గ్రామ సర్పంచ్ గౌత్రే లక్ష్మి, పాఠశాల కమిటీ అధ్యక్షురాలు పద్మ, ఉపసర్పంచ్ భరత్, కాంప్లెక్స్ వనరుల వ్యక్తి శివానంద్, ఉపాధ్యాయులు శంకర్, హరీష్, హేమలత, స్వాతి, రాజేష్, భవిత కేంద్రం సమన్వయకర్త సతీష్ తదితరులు పాల్గొన్నారు.