ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంః మంత్రి శ్రీధర్‌బాబు
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ప్రపంచ స్థాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఏరోస్పేస్ గ్లోబల్ సప్లై చైన్‌లో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌కు గుర్తింపు తెస్తామని తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు తిగాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన జేఈహెచ్ ఏరోస్పేస్ సంస్థతోపాటు టూలింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రెసిషన్ ఇంజినీరింగ్‌కు కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణలో ఏరోస్పేస్ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ సంస్థ ఏర్పాటుతో విమాన విడిభాగాల తయారీ, మరమ్మతులకు అవసరమైన అధునాతన టూల్స్ అందుబాటులోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విమానాలు, విమాన ఇంజిన్ల తయారీ, నిర్వహణకు ప్రత్యేక పరికరాలు తయారవుతాయని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇప్పటివరకు విదేశాలపై ఆధారపడుతున్న టూలింగ్ అవసరాలకు ఇకపై స్థానికంగానే తయారవుతాయని అన్నారు. ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ప్రకటించారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రెసిషన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. గ్లోబల్ కంపెనీలతో స్థానిక ఎంఎస్ఎంఈల అనుసంధానానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, రక్షణ రంగాలకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలు అమలు చేస్తోందని మంత్రి శ్రీదర్ బాబు వివరించారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.