BREAKING
అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు… 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల 29, డిసెంబర్ 2న పోలింగ్: కలెక్టర్ కొద్దిసేపట్లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు. ఉత్తరాంధ్రపై తుఫాను పంజా..! డాక్టర్ మైపతి అరుణ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి వంజిరి పాఠశాలలో డిజిటల్ తరగతి ప్రారంభం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు

మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు

Select Suryaa Now
మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు
సూర్య, మందమర్రి : విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ (కాచిగూడ) విశేష సేవలు అందిస్తోందని సంఘం నాయకులు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు, పేద కుటుంబాలు మహాసభ అందిస్తున్న సంక్షేమ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షుడు మిట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. 1970లో ప్రారంభమైన రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ గత 25 ఏళ్లుగా విద్య, వైద్యం, పేదల సంక్షేమం కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. విద్యారంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీబీఎస్ వంటి కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి నగదు పురస్కారాలు, గోల్డ్ మెడల్స్ అందిస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు లేని అనాథ విద్యార్థుల ప్రభుత్వ విద్యా ఫీజులను పూర్తిగా, దివ్యాంగ విద్యార్థుల ఫీజుల్లో సగభాగాన్ని మహాసభ భరిస్తోందని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన మున్నూరు కాపు విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు, ఆర్థిక సహాయం అందించనున్నట్లు నాయకులు వెల్లడించారు. విద్యార్థులు ఏ పాఠశాల లేదా కళాశాలలో చదివినా ఈ అవకాశాన్ని పొందవచ్చని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తమ విద్యా వివరాలను వెంటనే సంఘానికి అందజేస్తే, వాటిని కాచిగూడ మహాసభకు పంపించి బహుమతుల వివరాలను తెలియజేస్తామని చెప్పారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు పుస్తెలు, మట్టెలు, నూతన వస్త్రాలు అందిస్తూ ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో తల్లిదండ్రులను కోల్పోయిన నిరుపేద మున్నూరు కాపు వధూవరులు ఉంటే వారి వివాహాలకు ట్రస్ట్ ద్వారా మంగళసూత్రం, మట్టెలు అందిస్తామని, వివాహ వస్త్రాల బాధ్యతను స్థానిక సంఘం తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నివసించే పేదలకు కంటి, గుండె పరీక్షలు, ఎక్స్‌రే తదితర వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు ప్రతి బుధ, శుక్రవారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లైఫ్ కార్డు ద్వారా వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. నగరంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు సగం ఫీజుతో హాస్టల్ వసతి, తక్కువ ఖర్చుతో ఫంక్షన్ హాల్, రూ.1,500కే మ్యారేజ్ బ్యూరో సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది మెరిట్ అవార్డులు, విద్యా సహాయం పొందాలనుకునే విద్యార్థులు డిసెంబర్ 5వ తేదీలోగా దరఖాస్తులు పూర్తి చేసి స్థానిక సంఘం నాయకులకు అందించాలని కోరారు. కుల ధ్రువీకరణ పత్రం అవసరమైన వారికి సంఘం తరఫున జారీ చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9247738099, 7013457134, 8978572223 నంబర్లను సంప్రదించాలని సూచించారు. సామాజిక వర్గ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహాసభ అందిస్తున్న సేవలను అర్హులకు చేరవేసేందుకు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పార్వతి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాకం సంతోష్, యూత్ అధ్యక్షుడు తోట సురేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గి సత్తయ్య, యూత్ ప్రధాన కార్యదర్శి గాండ్ల సంజీవ్, బట్టు రాజ్‌కుమార్, మాసాడి శ్రీరాములు, జాడ క్రాంతికుమార్, బద్రి సతీష్, నార లింగయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.