పురపోరులో ఉత్కంఠ రేపిన స్వతంత్రఅభ్యర్థులు...
అమలాపురం మేజర్ న్యూస్ పురపోరులో ఉత్కంఠ క్షణాలు చోటుచేసుకున్నాయి. స్వతంత్రులు ఇచ్చిన పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థులను పరుగులు పెట్టించాయి. జనసేన, టిడిపి అభ్యర్థులు చివరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠ కు గురి అయ్యారు అంటే వారు పోరాడిన తీరు ఇక్కడ ప్రస్థావించ వచ్చు. అమలాపురం 10 వార్డు లో జనసేన తరుపున గండి స్వామి బరిలో నిలబడ్డారు. సమస్యలు పై దూకుడుగా ఉండే స్వామి నెత్తిన చిరు వివాదం పడింది. దాంతో స్థానిక కుటుంబీకుల నుంచి స్వతంత్రుడు పుట్టుకొచ్చాడు. నిరంతరం ప్రజా సేవలో ఉండే హార్డ్ కోర్ టిడిపి నాయకుడు రాయపరెడ్డి సూరిబాబు బరిలోకి వచ్చారు. ఎన్నికల రంగంలో అతను జరిపిన పోరు గ్లాస్ గుర్తు ముందు బ్యాట్ గుర్తుతో బౌల్డ్ అయ్యాడు. 24 ఒట్లు తేడాతో ఓడిపోయారు
రెండవ వ్యక్తి పడాల నానాజీ
జనసేన కు హార్డ్ కోర్ నాయకుడు. గతంలో గెలిచిన ఆరుగురు జనసేన అభ్యర్థులు కు అవకాశం వస్తుందని భావించిన నానాజీ ఎదురు దెబ్బ తగిలింది. టిడిపిలో గత కౌన్సిల్ వున్న ముగ్గురికి అవకాశం దక్కగా రిజర్వేషన్ అనుకూలంగా లేక పోవడం తో బొర్రా చిట్టిబాబు కు అవకాశం ఇవ్వలేదు. అయితే జనసేన లో గత కౌన్సిలర్లు అందరికి పోటీ చేసే అవకాశం వున్నా ముగ్గురికి కల్పించి స్థానిక నేతలు ముగ్గుర్ని పక్కన పెట్టారు. నేతలు బుజ్జగింపులతో ఇద్దరు సర్దుకున్నా తనకు వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోను అంటూ పడాల నానాజీ జనసేన నేతలుపై వత్తిడి పెంచారు. పొత్తులో భాగంగా అతని వార్డు టిడిపి కి వెళ్లడం అక్కడ అనూహింగా నల్లా శ్రీదేవి బరిలోకి రావడం నానాజీ కి అహం దెబ్బతింది. తన భార్య పడాల శ్రీదేవి ని బరిలోకి దింపి పోరాటం చేశారు. కేవలం 40 ఒట్లు తో ఆయన విజయానికి దూరం అయ్యారు. స్వతంత్రులు వెనకాల ఏ పార్టీ నేతలు అంతర్గతంగా ఉన్నా వీరు జరిపిన పోరు ప్రధాన పార్టీ అభ్యర్థులు కు చెమటలు పట్టించాయని చెప్పవచ్చు.