ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్ 70.73 శాతం నమోదైన పోలింగ్
రామచంద్రపురం మేజర్ న్యూస్,:రామచంద్రాపురం పురపాలక ఎన్నికల్లో ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మొత్తం 32 వార్డుల్లో 50 పోలింగ్ బూత్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. మొత్తంగా 70.73% పోలింగ్ నమోదు కాగా 35728 ఓటర్లకు గాను 25270 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అందులో పురుషులు 17188 ఉండగా వీరిలో 12113 మంది ఓటు హక్కును వినియోగించుకోగా మహిళలు 18540 మందికి గాను 13157 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా రెండో వార్డులో 81.61 శాతం పోలింగ్ నమోదు కాగా అతి తక్కువగా 12వ వార్డులో 58.59% నమోదయింది పట్టణంలోని రత్నంపేట మున్సిపల్ స్కూల్ నందు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు .
టిడిపి చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు ఆరో వార్డులో ఓటు వేశారు వైసీపీ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు పదో వార్డు శాంతినగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం పోలింగ్ సరళి మందకోడిగా సాగగా మధ్యాహ్నం నుంచి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను చింతపల్లి సూరన్న నగర్ లో గల స్ట్రాంగ్ రూముల వద్దకు చేర్చారు రామచంద్రపురం డి.ఎస్.పి ఎం శేషు నేతృత్వంలో సిఏ వెంకటనారాయణ పర్యవేక్షణలో పట్టణంలో పోలింగ్ బూతులు వద్ద బందోబస్తు నిర్వహించారు