పంచాయితీ ఎన్నికలను నిబద్ధత తో నిర్వహించాలి
అచ్చుతాపురం మండలంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్
అనకాపల్లి ప్రతినిధి ,నవంబర్ 28, మేజర్ న్యూస్: ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనావళికి లోబడి వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం అచ్చుతాపురం మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూట్ అధికారులతో సమీక్షించారు. 29 వ తేది (ఆదివారం) ఉదయం 7-00 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలని, మధ్యాహ్నం 1-00 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2-00 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి వై శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ సత్యనారాయణ, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.