పాత వెల్లంటిలో సీపీఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారం
పాత వెల్లంటిలో సీపీఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారం
కత్తెర గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి.. 8వ వార్డులో కుక్కర్ గుర్తుపై విస్తృత ప్రచారం
ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఎం సీనియర్ నాయకులు బి.వి. రమణారెడ్డి
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామంలో సీపీఎం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సీపీఎం సీనియర్ నాయకులు బి.వి. రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, మండల కార్యదర్శి పి. జనార్ధన్ ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి పల్లవరపు చెంచయ్యతో కలిసి గ్రామంలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి పల్లవరపు చెంచయ్య ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను నేరుగా కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ అభ్యర్థి చెంచయ్యకు కత్తెర గుర్తు కేటాయించగా, 8వ వార్డు అభ్యర్థికి కుక్కర్ గుర్తు కేటాయించినట్లు నాయకులు ప్రజలకు వివరించారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిని, కుక్కర్ గుర్తుపై ఓటు వేసి 8వ వార్డు అభ్యర్థిని గెలిపించాలని కోరారు.ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో మమేకమై గ్రామంలో నెలకొన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కొరత, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీపీఎం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని నాయకులు పేర్కొన్నారు.ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పాత వెల్లంటిలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ప్రతి ఓటరును కలుసుకుంటూ తమ ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.ఈ కార్యక్రమంలో పల్లవరపు పెంచలయ్య, వనం రామచంద్రయ్య, పల్లవరపు సుబ్రహ్మణ్యం, పాదర్తి మస్తానయ్య, పెంచలయ్య, చిరంజీవి, మధు, పల్లవరపు జయంతి, పాదర్తి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.