BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

కోట్ల సహకారంతో కలచట్లలో రూ.1.50 కోట్లతో చెరువు ఆధునీకరణ.. నల్లబల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు కలచట్ల స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోవిందరెడ్డికి మద్దతు ప్రకటించిన బత్తుల రమేష్ రెడ్డి.

Select Suryaa Now
కోట్ల సహకారంతో కలచట్లలో రూ.1.50 కోట్లతో చెరువు ఆధునీకరణ.. నల్లబల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు  కలచట్ల స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోవిందరెడ్డికి మద్దతు ప్రకటించిన బత్తుల రమేష్ రెడ్డి.

ప్యాపిలి మేజర్ న్యూస్ :కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సహకారంతో కలచట్ల గ్రామంలో రైతుల ప్రయోజనార్థం రూ.1.50 కోట్లతో చెరువు ఆధునీకరణ పనులు చేపట్టామని, నల్లబల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని రైతు బిడ్డ బత్తుల రమేష్ రెడ్డి తెలిపారు. కలచట్ల పంచాయతీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం కాదని  గ్రామ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.కలచట్ల గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోవిందరెడ్డికి తన మద్దతు ప్రకటించిన ఆయన, గ్రామ ప్రజలు గోవిందరెడ్డిని గెలిపిస్తే  మాలగేరిలో ఓబులేసుని  స్వామి ఆలయాన్ని తన సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు.అలాగే కలచట్ల పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు, ఇళ్ల మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని బత్తుల రమేష్ రెడ్డి పేర్కొన్నారు. నీటి  సమస్య ఇబ్బంది దృష్ట్యా ఎస్సీ కాలనీకి సొంత నిధులతో  ట్యాంకర్ ద్వారా నేటి సరఫరా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సునీల్ పాల్గొన్నారు.