BREAKING
గంజాయి, మత్తుమందులు, నార్కోటిక్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఎస్‌ఎల్‌వీ వైన్స్ చోరీ కేసును ఛేదించిన యాలాల పోలీసులు *నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు* పాచిపెంట మండలంలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం సీఎంఆర్ఎఫ్.. నిరుపేదలకు వరం లాంటిది గోళ్ళ కిషోర్‌కు మద్దతుగా మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం చింత గోపాల్ గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు బారువ బీచ్ పనుల్లో అలసత్వం వద్దు! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్దె ద్యేయం.. సర్పంచ్ యువరేఖ *సజ్జాపూర్‌లో 478 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* ఇళ్ల స్థలాల నోటీసులతో ఆందోళన.. మంతటి వాసులకు అండగా బీఎస్ఆర్ 18 వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలేకు నివాళి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించండి టిడిపి సర్పంచులకు పరిటాల శ్రీరామ్ పిలుపు పరిటాల శ్రీరామ్ ను ఘనంగా సత్కరించిన టిడిపి సర్పంచులు 21 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు!

*విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన*

Select Suryaa Now
*విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన*

మునిపల్లి;మునిపల్లి మండలం బుదేరాలోని మహిళా డిగ్రీ కళాశాలను శనివారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మునిపల్లి మండల ప్రత్యేక అధికారి రామాచారి సందర్శించి, కళాశాలలోని వసతులు, భోజన ఏర్పాట్లు, పరిసరాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కళాశాలలోని వంటగది, స్టోర్ రూమ్, భోజన తయారీకి వినియోగించే సామగ్రి, కళాశాల పరిసరాలను కలియతిరిగి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, కళాశాల ఆవరణలో పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు ఎలా సాగుతోంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా, కళాశాలలో అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉంది, వసతులు సక్రమంగా ఉన్నాయా తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఉద్బోధించారు. విద్యను తమ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మలుచుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.