*నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు*
కోహిర్;కోహిర్ మండల పరిధిలో ఖానాపూర్ గ్రామంలో ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ బీమా పథకం రైతులకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేయడం గొప్ప విషయమన్నారు. ఇందిరమ్మ బీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులు ఇందిరమ్మ బీమా పథకానికి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జీపీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.