BREAKING
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

21 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు!

Select Suryaa Now
21 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు!

సంగారెడ్డి;రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సంబంధాలకు ప్రాధాన్యతనిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసానికి వెళ్లారు. జగ్గారెడ్డి తనయుడు భరత్ సాయిరెడ్డి, పాలక్ పటేల్ వివాహం సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సభ్యులతో హరీష్ రావు ఆత్మీయంగా ముచ్చటించారు. రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగత అనుబంధాలను కొనసాగిస్తూ ఇద్దరు నేతలు కలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితర నాయకులు హాజరయ్యారు.దాదాపు 21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి, హరీష్ రావు ఇలా కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఆత్మీయ భేటీ సంగారెడ్డి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.