BREAKING
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

ఇళ్ల స్థలాల నోటీసులతో ఆందోళన.. మంతటి వాసులకు అండగా బీఎస్ఆర్

Select Suryaa Now
ఇళ్ల స్థలాల నోటీసులతో ఆందోళన.. మంతటి వాసులకు అండగా బీఎస్ఆర్

బషీరాబాద్, మేజర్ న్యూస్: ఇళ్ల స్థలాలకు సంబంధించి న్యాయపరమైన నోటీసులు అందడంతో బషీరాబాద్ మండలం మంతటి గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. సర్వే నంబర్ 129లో పేదలు ఇళ్ల నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలాలకు నోటీసులు రావడంతో తమ ఇళ్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజానాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బీఎస్ఆర్) దృష్టికి సమస్యను తీసుకెళ్లారు.లబ్ధిదారుల సమస్యను తెలుసుకున్న బీఎస్ఆర్ శనివారం స్వయంగా మంతటి గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. స్థలాలకు సంబంధించిన వివాదం, న్యాయపరమైన నోటీసులు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఆవేదనను విన్న ఆయన సమస్య పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.న్యాయపరంగా సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న బీఎస్ఆర్, లీగల్ నోటీసులకు సమర్థవంతంగా కౌంటర్ ఇచ్చేందుకు సీనియర్ న్యాయవాదిని సంప్రదించారు. అంతేకాకుండా గ్రామానికి వచ్చి స్థలాల వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసుకు సంబంధించిన అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని న్యాయవాదిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా బీఎస్ఆర్ మాట్లాడుతూ… పేదలు ఎంతో ఆశతో, కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుగోలు చేసుకున్న ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రతి అంశాన్ని చట్టపరంగా పరిశీలించి, లబ్ధిదారులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితులకు సహకారం అందిస్తానని భరోసా కల్పించారు.