చింత గోపాల్ గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు
సదాశివపేట;సదాశివపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ నూతన గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన చింత గోపాల్ కుటుంబ సభ్యులకు నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారి నూతన నివాసంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అనంతరం కుటుంబ సభ్యులతో నాయకులు ఆత్మీయంగా ముచ్చటించి, వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ప్రముఖ రాజకీయ నాయకుల రాకతో గృహప్రవేశ వేడుకకు ప్రత్యేక శోభ సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.