*సజ్జాపూర్‌లో 478 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
కోహిర్;కోహిర్ మండల పరిధిలోని సజ్జాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన 478 నూతన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె. మైసయ్య, రేషన్ డీలర్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ప్రభుత్వం అందించిన నూతన రేషన్ కార్డులతో అర్హులైన కుటుంబాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పొందడంలో మరింత సౌలభ్యం కలుగుతుందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి (జీపీఓ) శివకుమార్, స్థానిక వార్డు సభ్యులు, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.