BREAKING
కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత. విశాఖలో యువకుల వీరంగం.. రాళ్లు, రాడ్లతో దాడులు!

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం 
--పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది 
--నేడే పోలింగ్ 
ఆత్మకూరు, మేజర్ న్యూస్:
ఆత్మకూరు మండలంలో ఆదివారం జరగనున్న గ్రామపంచాయతీల ఎన్నికల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సిబ్బంది కూడా ఆయా గ్రామాలకు శనివారం సాయంత్రానికే చేరుకున్నారని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి రఫీ ఖాన్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఎన్నికల మెటీరియల్ సిబ్బందికి పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు. మండలంలో 21 గ్రామ పంచాయతీల గాను 9 చోట్ల సర్పంచ్ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా,వాసిలి పంచాయతీలో మాత్రం సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైనా కొన్ని వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 12 పంచాయతీల్లో 28 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీల్లో ఉన్నారు. వార్డులు 71 గాను 156 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.పోలింగ్ కోసం 107 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రూట్లుగా విభజించి సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని ఎంపీడీవో రఫీ ఖాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ పి. పద్మజాకుమారి, ఐసిడిఎస్ సి డిపి ఓ పి.సునీలత, మాస్టర్ ట్రైనర్ కలిశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.