BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

Select Suryaa Now
బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

 

 టీడీపీ జిల్లా అధ్యక్షులు చెక్కుడు కుప్పం షణ్ముగం రెడ్డి

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ జిల్లా అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు చెక్కుడు కుప్పం షణ్ముగం రెడ్డి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాకుండా, సమాజంలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి విద్యా వెలుగులు నింపిన మహోన్నత సామాజిక విప్లవకారుడని కొనియాడారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు.మహిళలకు విద్య అందించడంలో, సమాన హక్కుల కోసం పోరాడటంలో ఆయన చూపిన చొరవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి మార్గదర్శకమని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించడమే మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మోదిలియర్ కార్పొరేషన్ చైర్మన్ సి ఎం టి. త్యాగరాజన్, నగర ప్రధాన కార్యదర్శి పచ్చప్ప, నగర బీసీ అధ్యక్షులు ఉదయ్ కుమార్, చిత్తూరు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు గోపాల్, టిడిపి నాయకులు గుణశేఖర్, శివకుమార్, ఎస్.వి. గోపి, ఖలేషా, శేషాద్రి, కిరణ్, మురుగ, లోకేష్, నళిని తిరుకుమరన్, లీలావతి తదితరులు పాల్గొన్నారు.

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.