రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం;రామచంద్రాపురం డివిజన్ జి.ఎచ్.ఏం.సి కార్యాలయం ప్రాంగణం లో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.