BREAKING
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు! మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలికిన శ్రీరామ్ చినబాబు శ్రీసోమేశ్వరస్వామికి విశేష అలంకరణ అలుగునూరులో గులాబీ జనసంద్రం! ‘కౌంట్‌డౌన్ షురూ.. 500 రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’- కిక్కిరిసిన సభా ప్రాంగణం.. రోడ్లపైనే నిలిచిపోయిన వందలాది వాహనాలు, ప్రజలు చల్లపల్లి మండలంలో 196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కార్తీక మాస వేడుకల్లో భాగంగా మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పొగ రహిత భవిష్యత్తుకు సైన్స్, ఆవిష్కరణలే కీలకం కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు భక్తుల సంతృప్తిలో ఇంద్రకీలాద్రికి రాష్ట్రంలోనే అగ్రస్థానం గొల్లపల్లి ఉప సర్పంచ్ గా పూడి బిందు మాధవి శిథిలావస్థలో చారిత్రక పాశుపతేశ్వర ఆలయం.. పునరుద్ధరణకు కసరత్తు! అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా

గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా వై.ఎస్ రవి యాదవ్

Select Suryaa Now
గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా  వై.ఎస్  రవి యాదవ్

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్:
తిరుపతి రూరల్ మండలం గాంధీ పురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతు దారుడు  వైయస్ రవి యాదవ్ 723 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. తనకు ఇంతటి భారీ విజయాన్ని ఇచ్చిన గ్రామపంచాయతీ ఓటర్లకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. గ్రామపంచాయతీలో ఎన్నికలలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆదివారం జరిగిన ఎన్నికల పోలింగ్ వైయస్ రవి యాదవ్ విజయం వైపు ఓటర్లు మొగ్గు చూపారు.  అనంతరం రవి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ  ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారంతో గ్రామపంచాయతీ ని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పంచాయతీలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చిన సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించే దిశగా చొరవ చూపుతానని చెప్పారు. సర్పంచ్ గా రవి యాదవ్ గెలుపొందడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయన అనుచరులు స్నేహితులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ గా గెలుపొందిన రవి యాదవ్ ను కలసి పలువురు అభినందనలతో ముంచెత్తారు. గెలుపొందిన టిడిపి మద్దతు వార్డు మెంబర్లు అందరూ ఉపసర్పంచ్ గా హేమలతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

H. Dwaraka, staff reporter 

9705347341