ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న సర్పంచ్ అభ్యర్థి బండ్లమూరి వెంకటేశ్వరరావు
ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న సర్పంచ్ అభ్యర్థి బండ్లమూరి వెంకటేశ్వరరావు
పాములపాడు సూర్య న్యూస్ పరిధిలోని భానుముక్కల గ్రామ సర్పంచ్ అభ్యర్థి బండ్లమూరి వెంకటేశ్వరరావు తన ఎన్నికల గుర్తు ఉంగరానికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎంపీపీగా, సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామంలోనే కాకుండా మండల పరిధిలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిని కొనసాగించేందుకు తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొంటూ ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సురేష్, రాము, కార్యకర్తలు పాల్గొన్నారు.