సౌత్ మోపూర్‌లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వార్డులు ఏకగ్రీవం!
సౌత్ మోపూర్‌లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వార్డులు ఏకగ్రీవం!
ముగ్గురు వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించిన ఆనం విజయకుమార్ రెడ్డి
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ :
నెల్లూరు రూరల్ మండలం సౌత్ మోపూర్ గ్రామంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముగ్గురు వార్డు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఆనం విజయకుమార్ రెడ్డి ఆశీస్సులతో, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో, నెల్లూరు రూరల్ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు బండ్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ విజయం సాధించారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో 6వ వార్డు సభ్యుడిగా షేక్ కరీం భాష, 7వ వార్డు సభ్యురాలిగా ఉసురుపాటి మమత,11వ వార్డు సభ్యుడిగా బిరుదులు కృష్ణయ్య ఉన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ఏకగ్రీవ వార్డు సభ్యులను ఆనం విజయకుమార్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.