BREAKING
ఆస్ట్రేలియాపై సామ్ కరన్ విధ్వంసక ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం సీనియర్ వైద్యుడు డా. గోపు కిషన్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. : సీఎం సొంత జిల్లాలోనే ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫొటో గల్లంతు.. సోషల్ మీడియాలో వైరల్ కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి..

దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు

Select Suryaa Now
దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు

....
సూర్య - పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించగా ఈ వో శంకరయ్య, సర్పంచ్ బొక్కల రేఖ సంతోష్ లు ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ.. స్వామివారి జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో  పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ నరేష్  ముత్యాల, సర్పంచ్ లు గుర్రపు అంజయ్య, అరె సంతోష్, గంట రమేష్, మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేష్, చుంచు సదయ్య,  కాంగ్రెస్ నాయకులు సందనవేణీ రాజేందర్, తలారి సాగర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.