BREAKING
ఆస్ట్రేలియాపై సామ్ కరన్ విధ్వంసక ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం సీనియర్ వైద్యుడు డా. గోపు కిషన్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. : సీఎం సొంత జిల్లాలోనే ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫొటో గల్లంతు.. సోషల్ మీడియాలో వైరల్ కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి..

ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు!

Select Suryaa Now
ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు!

చిన్నకోడూరు;చిరువ్యాపారులకు ఆర్థిక చేయూత అందించాల్సిన బ్యాంకులే రుణ వసూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఆరోపణలు చిన్నకోడూరులో కలకలం రేపుతున్నాయి.చిన్నకోడూరులోని యూనియన్ బ్యాంకులో ముద్ర పథకం కింద రూ.2 లక్షల రుణం తీసుకున్న ఓ చిరువ్యాపారి ప్రస్తుతం బ్యాంకు వసూళ్ల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నాడు.వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో నెలవారీ రుణ వాయిదాలు చెల్లించడం భారంగా మారిందని బాధితుడు తెలిపాడు.ఇప్పటివరకు తన సేవింగ్స్ ఖాతా నుంచి ప్రతి నెల రూ.2 వేల చొప్పున ఆటో డెబిట్ అవుతుండగా, నగదు రూపంలోనూ సుమారు రూ.లక్ష చెల్లించినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నెలవారీ వాయిదా తగ్గించి చెల్లించేందుకు అవకాశం కల్పించాలని బ్యాంకు అధికారులను కోరినా స్పందన లేదని ఆరోపించాడు.ప్రతి నెలా రూ.4,300 తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు వాపోయాడు.రుణ వాయిదాల కోసం తరచూ ఫోన్లు చేయడమే కాకుండా, సెలవు రోజుల్లోనూ ఫోన్లు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు.అంతటితో ఆగకుండా రాత్రి వేళల్లో కొందరు బ్యాంకు సిబ్బంది మద్యం సేవించి తన దుకాణం వద్దకు వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు చేశాడు.రుణం తీసుకున్న చిరువ్యాపారి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుని నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాల్సిన బ్యాంకు సిబ్బంది,ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.రుణ వసూళ్ల పేరుతో రాత్రివేళల్లో దుకాణాల వద్దకు వెళ్లి ఒత్తిడి చేయడం, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముద్ర పథకం ఉద్దేశం చిరువ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలవడమే..అలాంటి పథకం కింద రుణం తీసుకున్న వ్యాపారికి ఎదురవుతున్న ఇబ్బందులపై బ్యాంకు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాత్రివేళల్లో సిబ్బంది దుకాణం వద్దకు వచ్చిన ఘటనపై విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.