BREAKING
ఆస్ట్రేలియాపై సామ్ కరన్ విధ్వంసక ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం సీనియర్ వైద్యుడు డా. గోపు కిషన్ పార్థివదేహానికి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. : సీఎం సొంత జిల్లాలోనే ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫొటో గల్లంతు.. సోషల్ మీడియాలో వైరల్ కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేస్తాం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లలిత కళాపరిషత్ లో డిప్యూటీ మేయర్ టి. స్వాతికి ఘనసత్కారం.. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి : రాయపూడి ని పరామర్శించిన మండలి వెంకట్రామ్ అనంతలో సండేస్ ఆన్ సైకిల్ 100వ ఎడిషన్.. భారీగా పాల్గొన్న విద్యార్థులు క్రీడాకారులు భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ.. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి మనవరాలి పట్టుబట్టడంతో థియేటర్లో రామాయణం చూసిన అమిత్ షా.. సినిమాపై ప్రశంసల వర్షం రెండో విడతలోనూ టీడీపీ హవా! పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి దేవునిపల్లి రథోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరమణ రావు రెండో విడతలోనూ కొనసాగిన తొలివిడత ఒరవడి..

ఘనంగా సూఫీ అభిషిక్తులు..

Select Suryaa Now
ఘనంగా సూఫీ అభిషిక్తులు..

విజయనగరం మేజర్ న్యూస్: హజరత్ ఖాదర్ వలీ బాబా దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి(ధర్మకర్త), హజరత్ ఖాజా మొహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారి సూఫీ పరంపర అభిషిక్తులు, ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ (ఖలీల్ బాబు ) పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.  శనివారం అర్ధరాత్రి  ఖలీల్ బాబు ప్రేమికులు కేక్ కట్ చేసి, ఆయన్ని పూలతో అభిషేకించి తమ భక్తి ప్రవృత్తులను చాటుకున్నారు. అయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఏటికే నిర్వాహక కమిటీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించింది. ఈ కార్యక్రమంకి రెడ్ క్రాస్ చైర్మన్ కంది వెంకట రమణ, కార్యదర్శి కెంగువ సత్యం, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ వెన్నెల చంద్ర శేఖర్, కోశాధికారి డాక్టర్ పొగిరి విశ్వేశ్వర రావు తదితరులు విచ్చేసి ఖలీల్ బాబుకి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అదేవిదంగా డాక్టర్ శ్రీరామ్మూర్తి సౌజన్యంతో శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆరో డివిజన్ కార్పొరేటర్ కోరాడ రాజు జైరాం విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఖలీల్ బాబు ప్రేమికులు, అభిమానులు, ఖాదర్ బాబా వారి భక్తులు విచ్చేసి కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏటికే వృద్దాశ్రమంలో గల వృద్దులకు పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. దర్బార్ కి విచ్చేసిన అభిమానులకు లంగర్ లో అన్న సమారాధన నిర్వహించారు. అదేవిదంగా ఆదివారం రాత్రి ఖాదర్ బాబా దర్బార్ లో  ఖలీల్ బాబు ప్రియ ప్రేమిఖులు ప్రత్యేక పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు ఖలీల్ బాబుతో కేకులు కట్ చేయించి, అయనకి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమాన, భక్తి భావాలను చాటుకున్నారు. రాత్రి ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధనలో వేలాది మందికి ఖాదర్ బాబా వారి అన్న ప్రసాదాన్ని ఖలీల్ బాబు ఎంతో ఆత్మీయతో అందించారు. ఖలీల్ బాబు పెద్ద కుమారుడు అహ్మద్ బాబు పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలతో ఏటికే, దర్బార్ లోనూ రోజంతా పండగ సందడిని తలపించింది.

సామాజిక సేవల్లో యువత ముందుండాలి : ఖలీల్ బాబు

తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపి, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతీ ఒక్కరికీ ఖలీల్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులను, ముఖ్యంగా యువతనుద్దేశించి సందేశం ఇచ్చారు. సామాజిక సేవల్లో యువత ముందుండాన్నారు.
యువతే దేశానికి వెన్నుముక అని, రక్షకులని అన్నారు. కుల, మతాలు లేని సమాజాన్ని యువతే నిర్మించాలన్నారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవాలని సూచించారు. సమయాన్ని వృధా చేయకుండా, పెద్ద పెద్ద కలలు కంటూ వాటిని నెరవేర్చుకునే లక్ష్య సాధన దిశగా చదువుల్లో ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కని, కష్ట పడి పెంచుతున్న తల్లిదండ్రులకే పిల్లలపై సర్వ హక్కులు ఉంటాయని, పిల్లల భవిష్యత్ కోరి తల్లిదండ్రులు చెప్పే మాటలను పెడ చెవిన పెట్టవద్దని సూచించారు. వృద్ధాప్యంలో తల్లి దండ్రులకు పిల్లలు ఆదరణగా నిలవాలని అన్నారు. వృద్దాశ్రమాలు లేని భారత దేశాన్ని నిర్మించినపుడే మానవత్వం పరిడమిల్లుతున్నట్టు రూఢీ అవుతుందన్నారు. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, ఖాదర్ బాబా భక్తులు, ఖలీల్ బాబు అభిమానులు, ప్రేమికులు పాల్గొన్నారు.