BREAKING
పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు భారత్–శ్రీలంక వన్డే టికెట్ల విక్రయానికి ముహూర్తం ఖరారు ఐదుగురు బాధితులకు సహాయం అందించిన మానవత.

అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు.

Select Suryaa Now
అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు.

అల్లాదుర్గం మేజర్ న్యూస్.…అల్లాదుర్గం. ప్రజా, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన అల్లాదుర్గం చౌరస్తా నుండి మెటల్ కుంట వరకు రోడ్డు అద్వాన స్థితిపై తెలంగాణ లోకాయుక్త కు ఫిర్యాదు చేయడమే కాకుండా, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించడం జరిగిందని సింగూర్ జలాల సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గతంలో ఈ రోడ్డు దుస్థితి పై కోర్టును ఆశ్రయించడం జరిగిందని, ఆర్ అండ్ బి అధికారులు రోడ్డుకు మరమ్మత్తులు చేశామని కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చారని  ఆరోపించారు. ఈ రోడ్డు ప్రయాణించాలంటే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును బాగు చేశామని కోర్టుకు తప్పుడు నివేదికలు అధికారులు ఇచ్చారని గుర్తించి, లోకాయుక్త  లో మరల కేసు వేయడం జరిగిందని ఈనెల 25న జరిగిన విచారణలో అల్లాదుర్గం -మెటల్ కుంట రోడ్డు అద్వాన స్థితిని సాక్షాదారులతో సహా కోర్టుకు వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు బాగు కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్న, ప్రజలకు సురక్షితమైన రహదారిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. గతంలో లోకాయుక్తకు తప్పుడు నివేదికల సమర్పించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అత్యంత ప్రాధాన్యమున్న ఈ రహదారిని వెంటనే ప్రభుత్వం టెండర్లకు పిలిచి, మరమత్తు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.