BREAKING
గంజాయి, మత్తుమందులు, నార్కోటిక్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఎస్‌ఎల్‌వీ వైన్స్ చోరీ కేసును ఛేదించిన యాలాల పోలీసులు *నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు* పాచిపెంట మండలంలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం సీఎంఆర్ఎఫ్.. నిరుపేదలకు వరం లాంటిది గోళ్ళ కిషోర్‌కు మద్దతుగా మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం చింత గోపాల్ గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు బారువ బీచ్ పనుల్లో అలసత్వం వద్దు! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్దె ద్యేయం.. సర్పంచ్ యువరేఖ *సజ్జాపూర్‌లో 478 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* ఇళ్ల స్థలాల నోటీసులతో ఆందోళన.. మంతటి వాసులకు అండగా బీఎస్ఆర్ 18 వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలేకు నివాళి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించండి టిడిపి సర్పంచులకు పరిటాల శ్రీరామ్ పిలుపు పరిటాల శ్రీరామ్ ను ఘనంగా సత్కరించిన టిడిపి సర్పంచులు 21 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు!

చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు

Select Suryaa Now
చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు

చీపురుపల్లి మేజర్ న్యూస్ : మహాత్మ జ్యోతిరావు పూలే భారత దేశ చరిత్రలో గొప్ప సంఘసంస్కరణలు జరిపి చెరగని ముద్రణ వేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు.  మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి స్థానిక పాత బస్టాండ్ వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. కుల, మత, వర్గ వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ హక్కుల స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు విద్య అందించడమే సమాజ అభివృద్ధికి పునాది అని విశ్వసించిన పూలే, మహిళా విద్యకు విశేష ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. పూలే సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, మహిళా విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారానే అజ్ఞానం, అసమానతలు, సామాజిక వివక్షలను రూపుమాపగలమనే మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. సమానత్వం, విద్య, ఆత్మగౌరవం, సామాజిక చైతన్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే మహాత్మా జ్యోతిరావు పూలేకు అందించే నిజమైన నివాళి అని   రామ్ మల్లిక్ నాయుడు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, సర్పంచ్ అభ్యర్థి రౌతు కామ నాయుడు, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు,  కల్కి, నరేష్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా