BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

అనధికారిక పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు

Select Suryaa Now
అనధికారిక పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు

అనధికారిక పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు
-ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
-జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల
*-నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):
నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. రహదారులపై అనధికారికంగా వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ ఏఎస్పీ దీక్ష రామలింగాపురం జంక్షన్ నుంచి అండర్‌పాస్ మీదుగా ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా రహదారులపై, ముఖ్యంగా రోడ్డు మధ్యలో, నిషేధిత పార్కింగ్ ప్రాంతాల్లో అనధికారికంగా నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, కార్లను గుర్తించి టోయింగ్ వాహనం ద్వారా తరలించారు.సంబంధిత వాహనదారులకు జరిమానాలు విధించారు.రాంగ్ పార్కింగ్ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఏఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్, రోడ్డు భద్రత నియంత్రణ కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ నెల్లూరు జిల్లాలో ప్రారంభించారని, ఈ కేంద్రం ద్వారా నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.వాహనదారులు ట్రాఫిక్ సంకేతాలు, రహదారి సూచికలు, నో పార్కింగ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలిపి ఉంచాలని పోలీసులు సూచించారు.ఫుట్‌పాత్‌లు, కూడళ్లు, ఫ్లైఓవర్ల వద్ద ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల పాదచారులతో పాటు ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం జరిమానాల నుంచి తప్పించుకోవడానికే కాకుండా మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవడానికి కూడా అవసరమని స్పష్టం చేశారు.నెల్లూరు నగరాన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేని సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ఈ కార్యక్రమానికి ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు సహకరించాలని ఏఎస్పీ దీక్ష విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ సీఐ, ఉత్తర, దక్షిణ ట్రాఫిక్ సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.