మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య
కొండాపూర్;సదాశివపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా కొండాపూర్ మండలం చెర్ల గోపులారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్నం రత్నయ్య నియమితులయ్యారు. గతంలో ఆత్మ కమిటీ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయనకు తాజాగా మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు.చెర్ల గోపులారం గ్రామం మల్లేపల్లి నుంచి విడిపోయి ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన సమయంలో తొలి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన రత్నయ్య ఐదేళ్ల పాలనలో గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారు. నేటికీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్వయంగా రైతుగా వ్యవసాయంలో కొనసాగుతున్న ఆయనకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి దక్కడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తన నియామకానికి సహకరించిన పార్టీ అధిష్ఠానానికి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకత్వానికి, గ్రామ ప్రజలకు రత్నయ్య కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.