BREAKING
సీఎంఆర్ఎఫ్.. నిరుపేదలకు వరం లాంటిది గోళ్ళ కిషోర్‌కు మద్దతుగా మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం చింత గోపాల్ గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు బారువ బీచ్ పనుల్లో అలసత్వం వద్దు! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్దె ద్యేయం.. సర్పంచ్ యువరేఖ *సజ్జాపూర్‌లో 478 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* ఇళ్ల స్థలాల నోటీసులతో ఆందోళన.. మంతటి వాసులకు అండగా బీఎస్ఆర్ 18 వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలేకు నివాళి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించండి టిడిపి సర్పంచులకు పరిటాల శ్రీరామ్ పిలుపు పరిటాల శ్రీరామ్ ను ఘనంగా సత్కరించిన టిడిపి సర్పంచులు 21 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు! రత్నపల్లిలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం పీపల్ పహాడ్‌కు స్వచ్ఛ జలధార పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.... గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి.... అభివృద్ధికి ఓటు వేయండి.. గ్రామ ప్రగతికి తోడ్పడండి! ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు

టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం..

Select Suryaa Now
టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం..

కొల్చారం మేజర్ న్యూస్..…కొల్చారం మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో ఉన్న కంకర మిషన్ వద్దకు వచ్చిపోయే టిప్పర్ లారీలు అతివేగంగా,  అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు. గుర్తు తెలియని టిప్పర్ లారీ ఢీకొట్టడంతో గ్రామంలోని స్మశాన వాటిక కమాన్ కూలిపోయిందని, అధిక బరువుతో వెళ్లిన మరో టిప్పర్ లారీ ధాటికి మురుగు కాలువ కూలిపోయిందని ఆరోపిస్తూ గ్రామస్తులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలోని కొత్త కాలనీ నుండి కంకర మిషన్ వద్దకు వెళ్లే రోడ్డుపై కూర్చొని కంకర మిషన్ వద్దకు వచ్చి పోయే లారీలను నిలిపివేశారు. కంకర మిషన్ యజమానులు స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కంకర రవాణా చేస్తున్న సమయంలో రోడ్డుపై నీళ్లు చల్లకపోవడం వల్ల దుమ్ము రేగుతుందని ఆరోపించారు. అంతేగాకుండా మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి వద్దనుండి కంకర మిషన్ కు వెళ్లే దారిలో సిసి రోడ్డు వేయించి ఇస్తామని కంకర మిషన్ యజమానులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రజలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్సై మొయినుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ వారు మొండికేయడంతో యజమానులు వచ్చేవరకు వేచి ఉన్నారు. అనంతరం కంకర మిషన్ యజమానులు ఘటన స్థలానికి చేరుకుని కూలిపోయిన స్మశాన వాటిక కమాన్, మురుగు కాలువను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి కూలిన నిర్మాణాలకు మరమ్మత్తులు చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. సిసి రోడ్డు నిర్మాణ పనులు సైతం పరిశీలిస్తామని తెలపడంతో గ్రామస్తులు శాంతించారు.