పీపల్ పహాడ్‌కు స్వచ్ఛ జలధార
*రూ.3.50 లక్షలతో తాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు*
*సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్*
చౌటుప్పల్, మేజర్ న్యూస్:పీపల్ పహాడ్ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా నూతన తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ పులనగారి నాగేశ్వరి అశ్విన్ కుమార్ గౌడ్ తెలిపారు. వైబ్రాక్ యానిమల్ హెల్త్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ.3.50 లక్షల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం మా ప్రాధాన్యం. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడమే మా లక్ష్యం. వైబ్రాక్ యానిమల్ హెల్త్ ఇండియా సంస్థ రూ.3.50 లక్షల ఆర్థిక సహకారం అందించి తాగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు తోడ్పడటం అభినందనీయం. ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వస్తుంది. గ్రామంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. గ్రామ ప్రజల సహకారంతో పీపల్ పహాడ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సీరాజ్ ఉద్దీన్, తిరుపతి రెడ్డి, శివశంకర్ రెడ్డి, మండల పశువైద్యాధికారి శ్రీధర్ రెడ్డి, ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి గీత, వార్డు సభ్యులు ఎర్ర సువర్ణ అంజయ్య, పిల్లి సాయి, బద్దం సుధాకర్ రెడ్డి, మాదగోని గాలయ్య, ఎర్ర పూజా పరమేష్, గట్టు మల్లేష్, దేవాలయ చైర్మన్ తొర్పునూరి నర్సింహా, డైరెక్టర్ పక్కీరు మంజుల అంజిరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ ఎర్ర పెంటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్లెంకి రాజు, మాజీ ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్య, బద్దం అంజిరెడ్డి, కొని రెడ్డి లింగమయ్య, బకనగారి పెంటయ్య, సిలివేరు మల్లయ్య, చెరుకు కిష్టయ్య, బోదాసు నాగరాజు, ఎర్ర నాగరాజు, నల్లెంకి లింగస్వామి, తాళ్ల రమేష్, రోషణగారి దయాకర్, బోయపల్లి నవీన్, తొర్పునూరి సాయి, రోషణగారి సందీప్, మిద్దెల లింగస్వామి, బకనగారి సాయి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.