BREAKING
జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్‌ అడ్వెంచర్‌ క్యాంప్‌కు అనురాగ్‌ విద్యార్థులు శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు.

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.... గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి....

Select Suryaa Now
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత....  గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి....

నర్సాపూర్, మేజర్ న్యూస్ ;  పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ, సమిష్టిగా కృషి చేయాలని, గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీఓ మహమ్మద్ మొజ్జం హుస్సేన్ పిలుపునిచ్చారు.శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి ఎంపీఓ మహమ్మద్ మొజ్జం హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ ఆనంద్ యాదవ్‌తో కలిసి గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, వాటిని నిర్దేశించిన విధంగా పారవేయాలని సూచించారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఈ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.