పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన షేక్ బాబావలి, వైస్ చైర్మన్ గా ఎన్నికైన జూలకంటి సురేష్ తో పాటు 40 మంది వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, యరపతినేని నిఖిల్ హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ బాబావలి, వైస్ చైర్మన్ జూలకంటి సురేష్ లకు అధికారిక నియామక పత్రాలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల