BREAKING
వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు మైదానంలో సహచరులపై అసహనం సరికాదు: శుభ్‌మన్ గిల్ తీరుపై అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు వెల్లింగ్టన్ టెస్టులో మిచెల్, ఫిలిప్స్ అద్భుత పోరాటం: భారత్‌పై అరుదైన రికార్డు నమోదు సిరాజ్, జడేజా ఉన్నా ఫలితం మారేది కాదు: తొలి టెస్టు డ్రాపై శుభ్‌మన్ గిల్ స్పష్టత బేసిన్ రిజర్వ్‌లో అరుదైన డ్రా: 2015 తర్వాత 15 టెస్టుల్లో రెండోసారి మాత్రమే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై నవజోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు: క్రీడలపైనే దృష్టి పెట్టాలని పిలుపు ఆళ్లగడ్డ మున్సిపాలిలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి . ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోడిచెర్లలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌కు శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ నిజమైన స్పిన్నర్ ఎక్కడ? కుల్దీప్, మానవ్ సుతార్‌లపై సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. హౌస్ అరెస్ట్ వెల్లింగ్టన్ టెస్టు డ్రాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గండి: టీమిండియా ముందరి సమీకరణాలు ఇవే దీక్షా దివస్ సభకు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం

దీక్షా దివస్ సభకు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం

Select Suryaa Now
దీక్షా దివస్ సభకు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానం
సూర్య కరీంనగర్:  తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నవంబర్ 29న నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు ప్రజలను ఇంటింటికీ వెళ్లి ఆహ్వానిస్తున్నారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో సోమవారం మంకమ్మతోటలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొని ప్రజలకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, సభకు తప్పకుండా హాజరవుతామని పలువురు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.
మంకమ్మతోటలోని రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ప్రచారంలో నాయకులు ఇంటింటికీ తిరుగుతూ తెలంగాణ ఉద్యమం, అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిణామాలను వివరించారు. ఆత్మీయ పలకరింపులతో ప్రజలను ఆహ్వానించడంతో స్థానికుల్లో ఉత్సాహం నెలకొంది.1969–72 మధ్య తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరలేదని, 2009 నవంబర్ 29న కేసీఆర్ కరీంనగర్ నుంచి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీక్ష నేపథ్యంలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కరీంనగర్ గడ్డ నుంచి ప్రారంభమైన ఆ దీక్ష తెలంగాణ సాధన పోరాటంలో చరిత్రాత్మక ఘట్టమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, చల్ల హరిశంకర్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, నలువాల పుష్పలత, నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గందే మాధవి, నందేల్లి రమాదేవి, పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.