ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
సూర్య- బిక్కనూర్ : మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన, గోల్కొండ యాదగిరి కి మంజూరైన 45 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, గంగాధరి రామచంద్రం సోమవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు, లబ్ధిదారునికి చెక్కును పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలలో దళారుల ప్రమేయం లేకుండా, లబ్ధిదారులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు