వృద్ధురాలికి వీల్ చైర్ అందజేత..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలియజేసిన వృద్ధురాలు
సూర్య రాజన్న సిరిసిల్ల..వృద్ధురాలి ఇబ్బందిపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పందించి.. సమస్యకు పరిష్కారం చూపారు.సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్ కు చెందిన కొండ లలితవ్వ వృద్ధురాలు సోమవారం ఐడీఓసీకి రాగా, ఆమెతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమస్యపై వచ్చారో అడిగి తెలుసుకున్నారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తక్షణమే స్పందించి కొండ లలితవ్వకు వీల్ చైర్ అందజేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. వృద్ధురాలికి వెంటనే వీల్ చైర్ జిల్లా కలెక్టర్ అందజేశారు.తన సమస్య, ఇబ్బందిని అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో స్పందించి వీల్ చైర్ అందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలియజేశారు.