BREAKING
ప్రజల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా మేయర్‌గా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం *ఏకగ్రీవంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్‌ కూరపాటి రఘునాథరాజు పోలీసుల అండతోనే టీడీపీ గెలుపు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఓం చాప్టర్ 1 – రుధిరం మూడు రోజుల్లో రూ.13 కోట్ల గ్రాస్.. బాక్సాఫీస్ వద్ద జోరు పేద కుటుంబానికి రాజకీయ అవకాశం.. గొరవనహళ్లి అభివృద్ధే లక్ష్యంగా చందన్ రాం ఎన్నికల బరిలో! కార్మికుల హక్కుల కోసం పెన్నారు కంపెనీ ఎదుట ధర్నా కళ్యాణదుర్గాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం.. ఇందిరమ్మ జీవిత బీమా పేద ప్రజల కుటుంబాలకు ధీమా ఈఎన్ఈ రిపీట్‌లో కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి అదుర్స్.. ట్రోల్స్‌కు నటనతోనే సమాధానం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో వైద్య సదుపాయాల పరిశీలన ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మైనర్ వేధింపుల కేసులో వయోలిన్ విద్వాంసుడు అరెస్ట్: బాధితులు ధైర్యంగా ముందుకు రావాలన్న సింగర్ చిన్మయి మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్: ప్రభుదేవా దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'వీఎం 24' ప్రకటన 66 పరుగులకే ఆలౌట్ చేసి ఘనవిజయం సాధించినా నిరాశే: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ నుంచి అఫ్గనిస్థాన్ అవుట్ నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Select Suryaa Now
నెల రోజుల్లో ఎన్కతలకు రూ.2 కోట్ల నిధులు తీసుకొస్తా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మోమిన్‌పేట్,మేజర్ న్యూస్: ఎన్కతల గ్రామ అభివృద్ధికి నెల రోజుల్లో రూ.2 కోట్ల నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ఎన్కతల గ్రామంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. సోమవారం మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ శంకర్ భారతి మహారాజ్ ఆశ్రమంలో నిర్వహించిన శనైశ్చర స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, కళ్యాణ మండపం నిర్మాణ భూమిపూజ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు స్పీకర్‌కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శనైశ్చర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతామూర్తులను దర్శించుకున్నారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ కళ్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్మన్‌గా బొడ్డు శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గ సభ్యులు సైతం ప్రమాణం చేసి ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమం మోమిన్‌పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ యాదవ్, గ్రామ సర్పంచ్ పి. శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులు స్పీకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం తర్వాత శనైశ్చర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి, ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రమని అన్నారు. కళ్యాణ మండపం నిర్మాణం గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కల అని, ఆ కల నెరవేరే దిశగా భూమిపూజ జరగడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి, కళ్యాణ మండపం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. నెల రోజుల్లో రూ.2 కోట్ల నిధులు వచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్ధికి అవసరమైన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని, నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి, భక్తుల సేవకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోమిన్‌పేట్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు సురేందర్, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజుద్దీన్, మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మోమిన్‌పేట్ పీఏసీఎస్ చైర్మన్ నరోత్తం రెడ్డి, కొట్‌పల్లి మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఆశ్రమ నిర్వాహకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.