BREAKING
ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి కార్పొరేషన్ లో విప్ గా మదన్ కుమార్ రెడ్డి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విజేతలకు బహుమతులు పంపిణీ ఆలూరులో ప్రీ ప్రైమరీ తరగతి గది ప్రారంభం జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి  చెక్కు పంపిణి పట్టణాభివృద్ధిలో నూతన పాలకవర్గం భాగస్వాములు కావాలి ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ఇజ్రాయిల్ కుటుంబానికి ఆర్థిక చేయూత........ ఎంపీపీ చండ్రా మధుసూదన్ రావు సూచనలతో ఆర్థిక సహాయం అందించిన నాయకులు....... సీతారామ భద్ర క్షేత్ర ప్రారంభానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలి అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం ...ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు హెబ్బటం గ్రామ సర్పంచ్ కు ఘన సత్కారం నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వరం లాంటిది రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి అటు భారత్, ఇటు పాక్.. సైనికుల త్యాగాల నేపథ్యంతో ఆకట్టుకుంటున్న ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్

ప్రజల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
ప్రజల్లో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రజలకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ప్రధాన కూడళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఖేలో ఇండియా క్రీడలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఖేలో ఇండియా క్రీడా పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలతో పాటు వివిధ క్రీడా పోటీలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా నుంచి ప్రత్యేక క్రీడా బృందాన్ని పోటీలను తిలకించేందుకు పంపించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దీనివల్ల క్రీడాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి, స్ఫూర్తి మరింత పెరుగుతుందన్నారు.క్రీడా పోటీలు ముగిసే డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతిరోజూ వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత క్రీడా పాఠశాలలు, డీబీడీ కాంప్లెక్స్ మైదానం, ఏటీడీపీ పాఠశాల హాళ్లలో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, క్రీడల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్తు, డీఆర్వో స్రవంతి, క్రీడా శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.